ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విరాళాల’పై రాజకీయం చేయొద్దు

ABN, First Publish Date - 2020-04-09T09:28:39+05:30

ప్రజలు విరాళాలు అందించాలని తాము చేసిన ప్రకటనను రాజకీయం చేయవద్దని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న లోటుపాట్లను అధిగమించడానికే ఈ కార్యక్రమం తలపెట్టామని, తాము ేసకరించాలనుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు
  • జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు విష్ణు
  • తలసాని.. క్షమాపణ చెప్పాలి: వైద్యుల సంఘం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలు విరాళాలు అందించాలని తాము చేసిన ప్రకటనను రాజకీయం చేయవద్దని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న లోటుపాట్లను అధిగమించడానికే ఈ కార్యక్రమం తలపెట్టామని, తాము ేసకరించాలనుకున్న విరాళాలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ‘‘కరోనా రక్షణ పరికరాలు కావాలి. విరాళాలు అందించండి’’అని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం మంగళవారం ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. అనంతరం సంఘం అధ్యక్షుడు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులకు సహకరించాలన్న ఉద్దేశంతోనే విరాళాలకు పిలుపునిచ్చాని తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గుండగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జూనియర్‌ డాక్టర్లకు క్షమాపణలు చెప్పాలని సూచించారు.

Updated Date - 2020-04-09T09:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising