వహ్వా వరి!
ABN, First Publish Date - 2020-10-01T07:25:29+05:30
ఈ వానాకాలంలో వరి పంట సాధారణం కన్నా దాదాపుగా రెండింతలు ఎక్కువ సాగైంది. రాష్ట్రంలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 27,25,058 ఎకరాలు ఉంటే ఈ సీజన్‌లో.....
ఈ వానాకాలంలో రెండింతల సాగు
52.56 లక్షల ఎకరాల్లో వరిపంట
1.34 కోట్ల ఎకరాల్లో మొత్తం పంటలు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలంలో వరి పంట సాధారణం కన్నా దాదాపుగా రెండింతలు ఎక్కువ సాగైంది. రాష్ట్రంలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 27,25,058 ఎకరాలు ఉంటే ఈ సీజన్‌లో 52,55,607 ఎకరాల్లో సాగైంది. మిగతా పంటల సాగు విస్తీర్ణమూ పెరిగింది. మొత్తంగా ఈ ఖరీ్‌ఫలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని స్థాయిలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 30 శాతం అధికంగా సాగైనట్లు ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో 1,03,47,715 ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉంటే 1,34,34,835 ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. వరిలో 75శాతం (39.42లక్షల ఎకరాలు) సన్నరకాలు సాగయ్యాయి. రాష్ట్రంలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 44,50,029 ఎకరాలుంటే 66,22,127 ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. కంది కూడా 7,61,212 ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉంటే 10,76,717 ఎకరాల్లో సాగు చేశారు. ముతక ధాన్యాల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 13,03,905 ఎకరాలు ఉంటే, ఈ పంటలన్నీ కలిపి 3,36,640 ఎకరాల్లో సాగయ్యాయి. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 22ు పెరిగింది. నూనె గింజల సాగు విస్తీర్ణం 72 శాతానికి పడిపోయింది. వీటి సాధారణ సాగు విస్తీర్ణం 6,44,134 ఎకరాలు ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో 4,63,609 ఎకరాల్లోనే సాగుచేశారు.
Updated Date - 2020-10-01T07:25:29+05:30 IST