ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్టుగుట్టపై జైనమత చిహ్నాలు

ABN, First Publish Date - 2020-12-29T04:42:06+05:30

మెట్టుగుట్టపై జైనమత చిహ్నాలు

ధర్మనాథుని ప్రతిమ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లఘుశాసనం, ధర్మనాథుని పాదాలు, ప్రతిమ గుర్తింపు

హన్మకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాజీపేట మండలంలోని మడికొండ మెట్టుగుట్టపై జైన మత ప్రాభవ చిహ్నాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను  తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునిల్‌ సోమవారం వెల్లడించారు. గుట్టపైన ఓ లఘుశాసనంతో పాటు జైనమతానికి చెందిన ధర్మనాథుని ప్రతిమ, పాదాలను గుర్తించారు.  ఈ లఘుశాసనంలో జినబ్రహ్మజోగి అని రాసి ఉంది. ఈ శాసనం పైభాగాన ధర్మనాథుని పాదాలు, ఆ పక్కన ధర్మనాథుని చిన్న విగ్రహం ఉంది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో జైనమత ప్రాభవం సాక్ష్యాలుగా ఎన్నో శిథిల జైనబసదులు(సత్రాలు), మందిరాలు, శిల్పాలు కనిపిస్తాయి. రాష్ట్రకూటుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస (క్రీ.శ 888) జైనబసదులు, జైనగుడులు నిర్మించిన ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలోనే మెట్టుగుట్ట మీద కూడా జైనబసది నిర్మాణం జరిగి ఉంటుందని సునిల్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే మెట్టుగుట్ట మీద జినబ్రహ్మజోగి లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు చెక్కి ఉండవచ్చునని అన్నారు. తెలంగాణలో ఆదినాథ, పార్శ్వనాథ, మహావీరులకు అనేకచోట్ల జైనబసదులు, గుడులు నిర్మించారు. నేమినాథ, శాంతినాథ, సుపార్శ్వనాథ, అరనాథ, శీతలనాధులకు అరుదుగా జైనబసదులు,  విహారాలు కనిపిస్తాయి. ఆ కోవకు చెందినదే ఈ ధర్మనాథుని లఘుశానసం, ప్రతిమ అని వివరించారు. 

Updated Date - 2020-12-29T04:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising