ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2020-10-01T07:43:21+05:30
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీ....
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు అక్టోబరు-20 వరకు నిర్వహించవచ్చని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు.
Updated Date - 2020-10-01T07:43:21+05:30 IST