ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-10-28T21:20:54+05:30

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. సెక్రటేరియట్ కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ  చేపట్టారు. సెక్రటేరియట్ కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయం కూల్చివేత, నిర్మాణానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో మీరు పార్టీగా లేరని జస్టిస్ అశోక్ భూషణ్  తెలిపారు. తాము ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభావం పడిందని, పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టులో పార్టీగా లేనందున పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్జీటీలో లేవనెత్తిన అంశాలకు హైకోర్టు తీర్పు అడ్డురాదని సుప్రీంకోర్టు  పేర్కొంది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న దాన్ని ఎన్జీటీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

Updated Date - 2020-10-28T21:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising