ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ఫీజులపై విచారణ జరపాలి: ఎఫ్‌జీజీ

ABN, First Publish Date - 2020-07-11T08:49:30+05:30

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై విజిలెన్స్‌తో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గవర్నర్‌కు శుక్రవారం లేఖ రాశారు. 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో నంబరు 46 విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం సంవత్సరంలో నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని ఆయన గుర్తుచేశారు.


అయితే ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఓ వైపు అధిక ఫీజులు వసూలుచేస్తున్నాయని, మరోవైపు పాఠశాలలు నిర్వహించకుండా రవాణా చార్జీలు కూడా పిండుకుంటున్నాయని, ఆన్‌లైన్‌ పాఠాల కోసం కంప్యూటర్‌ ఇతర పరికరాలు తమ వద్దే కొనాలని షరతులు విధిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఏపీలో విద్యను వ్యాపారంగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రైవేటు పాఠశాలల్లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-07-11T08:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising