ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో..

ABN, First Publish Date - 2020-11-13T09:14:04+05:30

జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని అభ్యర్థిస్తూ నగరానికి చెందిన శ్రీధర్‌ బాబు, మహమ్మద్‌ తాహెర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు పిల్లల నిబంధనపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని అభ్యర్థిస్తూ నగరానికి చెందిన శ్రీధర్‌ బాబు, మహమ్మద్‌ తాహెర్‌.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన  ధర్మాసనం.. ఈ నెల 17లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపురి విచారణను ఈనెల  19కి వాయిదా వేసింది.


తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మునిసిపల్‌ చట్టంలో.. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలో ఈ నిబంధనను తొలగించినట్లు కోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. జీహె చ్‌ఎంసీ ఎన్నికలకు వర్తింపజేయడం అన్యాయమని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని వివరించారు. 



ఒకరు.. ఒక్క వార్డులోనే పోటీ.. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఏదేని ఒక్క వార్డులోనే పోటీ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్‌లు దాఖలు చేయవచ్చు. కానీ, ఉపసంహరణ గడువు ముగిసేలోగా ఏదేని ఒక వార్డులో మాత్రమే పోటీలో ఉండి.. ఇతర వార్డుల్లో ఉపసంహరించుకోవాలి.
ఒకరు ఒక వార్డుకు మించి పోటీ చేయడానికి వీలు లేదు. లేనిపక్షంలో అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసిన అన్ని చోట్లా వాటిని చెల్లనివిగా ప్రకటిస్తారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. 

Updated Date - 2020-11-13T09:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising