ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ స్టోన్‌ క్రషర్లపై దాఖలైన పిల్‌లో..కౌంటర్‌ ఎందుకు వేయలేదు?

ABN, First Publish Date - 2020-12-27T08:34:04+05:30

అక్రమ స్టోన్‌ క్రషర్‌ యూనిట్లపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)లో కౌంటర్‌ ఎందు కు వేయలేదని స్పెషల్‌ జీపీ సంజీవ్‌ కుమార్‌ను హైకోర్టు ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. నోటీసులు జారీ


హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అక్రమ స్టోన్‌ క్రషర్‌ యూనిట్లపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)లో కౌంటర్‌ ఎందు కు వేయలేదని స్పెషల్‌ జీపీ సంజీవ్‌ కుమార్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. స్పెషల్‌ జీపీ వారం గడువు కోరగా.. సమ్మతించిన ధర్మాసనం డిసెంబరు 31లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.


రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో  అనుమతులూ లేకుండా పెద్ద సంఖ్యలో స్టోన్‌ క్రషర్లు నిర్వహిస్తున్నారంటూ టి.శరత్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి పిల్‌ వేశారు. స్టోన్‌ క్రషర్ల వల్ల పరిసర ప్రాంతా ల్లో శబ్ధ, వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యా దు చేసినా స్పందించడం లేదన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.  


Updated Date - 2020-12-27T08:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising