ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరికలు.. మెరుపులు!

ABN, First Publish Date - 2020-05-19T10:21:42+05:30

వారేమీ శాస్త్రవేత్తలు కారు. పోనీ.. దేశంలోని ప్రఖ్యాత టెక్నికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో చదువుకున్న వారూ కారు. కేవలం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యను మాత్రమే చదువుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సన్‌గ్లాస్‌లు, టచ్‌లెస్‌ డోర్‌ బెల్స్‌, శానిటైజేషన్‌ బ్యాండ్‌, పోర్టబుల్‌ వెంటిలేటర్‌
  • కొవిడ్‌-19పై పోరులో.. పాఠశాల విద్యార్థుల సృజన


వారేమీ శాస్త్రవేత్తలు కారు. పోనీ.. దేశంలోని ప్రఖ్యాత టెక్నికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో చదువుకున్న వారూ కారు. కేవలం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యను మాత్రమే చదువుతున్నారు. అయితేనేం.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరు చేయడంలో చిట్టి మెదళ్లకు పదును పెట్టారు. కొవిడ్‌-19 నుంచి రక్షించుకునే మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలోనే డిస్టెన్స్‌ సెన్సార్స్‌తో కూడిన సన్‌ గ్లాస్‌లు, పోర్టబుల్‌ వెంటిలేటర్లు, టచ్‌లెస్‌ డోర్‌బెల్స్‌ను సృష్టించి అందరినీ అచ్చరువొందిచ్చారు.                                 

 న్యూఢిల్లీ


టచ్‌లెస్‌ డోర్‌బెల్‌

సార్థక్‌ జైన్‌, ఢిల్లీలోని షాలిమర్‌ బాగ్‌లో ఉన్న మోడరన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. ఇతను ఆటోమేటెడ్‌ టచ్‌లెస్‌ డోర్‌బెల్‌ ‘అర్డ్యునో’ను రూపొందించాడు. ఇది అలా్ట్రసోనిక్‌ సెన్సార్‌ విధానంలో పనిచేస్తుంది. డోర్‌ బెల్‌ను ముట్టుకోకుండానే ఇది మోగుతుంది. సార్థక్‌ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు ప్రతిరోజూ అనేకమార్లు డోర్‌బెల్‌ను మోగిస్తారు. ఈ క్రమంలో బెల్‌ స్విచ్‌ను టచ్‌ చేస్తారు. దీంతో వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. దీనిని నిరోధించేందుకే ‘అర్డ్యునో’ను రూపొందించా. ఈ బెల్‌కు 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో ఎవరైనా నిలబడితే ఆటోమేటిక్‌గా అది బీప్‌ శబ్దం చేస్తుంది’’ అని వివరించాడు. 


శానిటైజేషన్‌ బ్యాండ్‌

శివం ముఖర్జీ, ఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి. ఇతను ‘అభయ్‌’ అనే శానిటైజేషన్‌ బ్యాండ్‌ను రూపొందించాడు. ముఖర్జీ మాట్లాడుతూ..‘‘ఈ బ్యాండ్‌.. ప్రోక్సిమిటీ సెన్సార్‌, యూవీ లైట్‌తో పనిచేస్తుంది. మణికట్టుపై ధరించడం ద్వారా ఎదుటి వ్యక్తుల నుంచి వ్యాపించే క్రిములను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆల్కహాల్‌ బేస్డ్‌ స్ర్పే ద్వారా నిరోధిస్తుంది. ఈ బ్యాండ్‌ పూర్తిగా కంప్యూటర్‌ నియంత్రణలో, యాప్‌ ద్వారా పనిచేస్తుంది’’ అని వివరించాడు.  


పోర్టబుల్‌ వెంటిలేటర్‌

హరియాణాలోని అంబాలాకు చెందిన ఇద్దరు సోదరులు కార్తీక్‌ తార(8వ తరగతి), వినాయక్‌ తార(4వ తరగతి)లు చెక్కను వినియోగించి పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను రూపొందించారు. ‘రోబో చాంప్స్‌’ అనే పాఠం ఆధారంగా దీనిని రూపొందించినట్టు వారు వివరించారు. వెంటిలేటర్‌లో రెండు గోడలకు మధ్య ఒక బాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొతాన్ని మోటార్‌ సాయంతో పనిచేసేలా చేశారు. దీనిని మొబైల్‌ యాప్‌ ద్వారా అనుసంధానం చేశారు. దీంతో రోగి ఆరోగ్య స్థితిని వైద్యుడు తన మొబైల్‌ నుంచి పరిశీలించే అవకాశం ఉందని సోదరులు వివరించారు. దీనిని ఇప్పటికే రెండు ఆసుపత్రుల్లో వినియోగించామని, వైద్యుల సూచనలు రాగానే మరిన్ని మార్పులు చేస్తామని తెలిపారు. 


సన్‌గ్లాస్‌లు

బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటించేందుకు వీలుగా కార్తీక్‌, వినాయక్‌లే ఈ సన్‌గ్లాస్‌లను కూడా రూపొందించారు. ఐఆర్‌ సెన్సార్‌తో ఈ సన్‌గ్లాస్‌లు పనిచేస్తాయని తెలిపారు. దీనికి సంబంధించి ఒక కోడ్‌ ఉంటుందని, ఇది దూరాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతుందని వివరించారు. ఒక మీటరు కన్నా తక్కువ దూరంలో ఎవరైనా ఉంటే.. ఈ సన్‌ గ్లాస్‌లోని చిప్‌లు బీప్‌ శబ్దంతో హెచ్చరిస్తాయన్నారు. ‘దయచేసి కొంత దూరం జరగండి’ అనే సూచనలు కూడా చేస్తాయని తెలిపారు.  

Updated Date - 2020-05-19T10:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising