ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను చనిపోతున్నా..

ABN, First Publish Date - 2020-11-27T07:53:36+05:30

సంగారెడ్డిలోని రైతు శిక్షణా కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయాధికారిణి సీహెచ్‌ అరుణ(38).. మనూరు మండలం రాయిపల్లి వంతెన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సోదరుడికి ఫోన్‌ చేసి.. వ్యవసాయ అధికారిణి ఆత్మహత్య

సంగారెడ్డి క్రైం/మనూరు, నవంబరు 26: సంగారెడ్డిలోని రైతు శిక్షణా కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయాధికారిణి సీహెచ్‌ అరుణ(38).. మనూరు మండలం రాయిపల్లి వంతెన పైనుంచి మంజీర నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. అరుణ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి. 2016లో నాగల్‌గిద్ద మండలం మోర్గికి చెందిన శివకుమార్‌తో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ప్రైవేటు ఉద్యోగి. సంగారెడ్డిలోనే నివాసముంటున్నారు.


గురువారం మధ్యాహ్నం  వరుసకు తమ్ముడు అయిన పవన్‌కు ఆమె ఫోన్‌ చేశారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అతనితో చెప్పారు. వెంటనే అరుణ తమ్ముడు శివకుమార్‌కు ఫోన్‌ చేసి పవన్‌ విషయాన్ని చెప్పాడు. కంగారుపడ్డ శివకుమార్‌.. అరుణకు ఫోన్‌ చేయగా కలవలేదు.

వంతెనపైకి వెళ్లి చూడగా ఆమె వినియోగించే కారు ఉంది. దానిలో ఆమె చెప్పులు, బ్యాగ్‌ ఉన్నాయి. అరుణే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చారని, కారును వంతెనపై నిలిపి నదిలోకి దూకారని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అరుణ జాడ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.    


Updated Date - 2020-11-27T07:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising