ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త రాజీవ్‌‌కు జాతీయ అవార్డు

ABN, First Publish Date - 2020-07-18T20:59:44+05:30

తెలంగాణకు చెందిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ వర్షీనికి జాతీయ అవార్డు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి : తెలంగాణకు చెందిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ వర్షీనికి జాతీయ అవార్డు లభించింది. వ్యవసాయ రంగానికి రాజీవ్ అందిస్తున్న విశేషసేవలకు గుర్తింపుగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) ఆయనకు ‘రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌' అవార్డును ప్రదానం చేసింది. ఐసీఏఆర్‌ 92వ వార్షికోత్సవంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ అవార్డును విర్చ్యువల్ విధానంలో అందజేశారు. డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ ప్రస్తుతం ఇక్రిశాట్‌లోని ‘జెనెటిక్‌ గెయిన్స్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌'కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్లాంట్‌ జీనోమిక్స్‌, జినోమిక్స్‌ అసిస్టెడ్‌ క్రాప్‌బ్రీడింగ్‌ విభాగాల్లో రాజీవ్‌కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. ఆయన నేతృత్వంలోని ఇక్రిశాట్‌ బృందం కందులు, శనగలు, పల్లీలు, సజ్జ పంటల జన్యుక్రమాలను గుర్తించింది. ఐసీఏఆర్‌ 1956 నుంచి ఏటా ‘రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌'అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిని కూడా కేంద్ర వ్యవసాయ అనుబంధ సంస్థ అందజేస్తున్నది. కాగా ఈ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజీవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-07-18T20:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising