ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై దాడి కాదు.. హత్యాయత్నం జరిగింది

ABN, First Publish Date - 2020-12-03T07:40:04+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ రోజున బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేయడమే కాకుండా చంపేందుకే ప్రయత్నించారని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ చర్యను ఎందుకు సమర్ధించారో సీపీఐ నారాయణ సమాధానం చెప్పాలి : మంత్రి పువ్వాడ  

ఖమ్మం, డిసెంబరు 2(ప్రతినిధి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ రోజున బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేయడమే కాకుండా చంపేందుకే ప్రయత్నించారని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని మమత ఆస్పత్రి నుంచి తాను వెళుతుంటే బీజేపీ కార్యకర్తలు తన కాన్వాయ్‌లో ఉన్న కారును అడ్డగించి దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దాడితోపాటు హతమార్చేందుకు చూశారని  ఆరోపించారు.


తాను డబ్బులు పంచడానికి వచ్చానని బీజేపీ దుష్ప్రచారం చేసిందన్నారు. దుబ్బాకలో మాదిరి గోబెల్స్‌ ప్రచారంతో లబ్ధి పొందాలని ప్రయత్నించినా అది వికటించిందన్నారు. బీజేపీ  దాడిచేస్తే సీపీఐకి చెందిన చికెన్‌ నారాయణ ఎందుకు సమర్ధించారో సమాధానం చెప్పాలన్నా రు. ఆయన బీజేపీలో కొత్తగా ఎప్పుడు చేరారో అర్థం కావడంలేదన్నారు.   


Updated Date - 2020-12-03T07:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising