ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ రంగ స్వయం సమృద్ధే లక్ష్యం!

ABN, First Publish Date - 2020-06-07T08:31:51+05:30

రక్షణ రంగ స్వయం సమృద్ధే లక్ష్యం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో లాభం

యువత పాత్రను గుర్తించాం

డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ సతీ్‌షరెడ్డి

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ


దేశ రక్షణ రంగ రూపురేఖలను మార్చటానికి మోదీ సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిలో ప్రధానమైంది స్వయం సమృద్ధి. దీనిలో భాగంగానే తాజాగా రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 73 శాతం వరకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రక్షణ రంగానికి, మన దళాలకు అవసరమైన విదేశీ దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. ‘‘ఈ చర్యలన్నీ మనం స్వయం సమృద్ధి సాధించటానికి ఉపకరిస్తాయి. సమీప భవిష్యత్తులో రక్షణ రంగ ఉత్పత్తి రూపురేఖలే మారిపోతాయి..’’ అని అంటున్నారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైౖర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి. ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ.. 


రక్షణ రంగం రూపురేఖలు మారనున్నాయా?  

మనకు అవసరమైన రక్షణ ఉత్పత్తులన్నింటినీ స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారుచేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక దూరదృష్టి ఉంది. దీని వల్ల ఆయుధ వ్యవస్థలు, ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరముండదు. భవిష్యత్తు యుద్ధాలన్నీ స్వదేశీ ఆయుధాలతోనే జరుగుతాయని ఇటీవల త్రివిధ దళాల ప్రఽధానాధిపతి చేసిన ప్రకటననూ మనం గమనించాలి. 


మనదేశానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

ఏటా మనం కొన్ని వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తుంటాం. వాటిన్నింటినీ మనమే తయారుచేసుకోగలిగితే ఆ డబ్బంతా ఆదా చేసినట్లే కదా. దేశంలోనే ఈ ఆయుఽధాల తయారీ జరిగితే కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అనేక స్టార్టప్‌ కంపెనీలు అభివృద్ధి చెందుతాయి. దీని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది.  కరోనా వైర్‌సను కట్టడిచేయటానికి డీఆర్‌డీఓ రకరకాల టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. ఈ ఉత్పత్తులన్నింటినీ ప్రైవేట్‌ కంపెనీలే తయారుచేస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులు ఎగుమతి కూడా అవుతున్నాయి. అంటే కొవిడ్‌-19 వరకూ గ్లోబల్‌ సప్లై చైన్‌లో భాగస్వాములైనట్లే కదా. 


విదేశీ ఆయుధ దిగుమతులను నిషేధించడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?  

వాస్తవానికి దీనిని డీఆర్‌డీఓ ఒక అవకాశంగా భావిస్తోంది. క్షిపణులు, రాకెట్లు, రాడార్లు, సోనార్లు, ఎలకా్ట్రనిక్‌ వార్‌పేర్‌ వ్యవస్థలు, తుపాకులు, టార్పిడోలు ఇలా రకరకాల ఆయుధాల తయారీలో మన శక్తిని ఇప్పటికే రుజువు చేసుకున్నాం. డీఆర్‌డీఓకు అనుబంధంగా కొన్ని వేల మధ్యతరహా సంస్థలు పనిచేస్తున్నాయి. వారు మన ఆయుధాల వ్యవస్థలకు అవసరమైన సామగ్రిని, ఇతర వ్యవస్థలను తయారుచేసి ఇస్తుంటారు. ఆయుధాల దిగుమతిపై పెట్టిన నిషేధం వల్ల ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించగలమనే నమ్మకం మాకుంది. 


ఏయే ఆయుధ వ్యవస్థల తయారీపై దృష్టి పెట్టారు?  

ప్రధాన యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, వివిధ దశలలో ఉపయోగపడే రకరకాల క్షిపణులు, వివిధ రకాల రాడార్లు, యుద్ధ నౌకలకు.. జలాంతర్గాములకు అవసరమైన సోనార్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం.  


డీఆర్‌డీఓకు అనుబంధంగా పనిచేసే వేలాది ప్రైవేట్‌ సంస్థలు భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషించనున్నాయి ?  

అభివృద్ధి చెందిన దేశాల రక్షణ రంగాలలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం చాలా కీలకం. దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి అవసరాలున్నాయనే విషయాన్ని త్రివిధ దళాలు నిర్ణయిస్తే- వాటిని తయారుచేసి అందించే బాఽధ్యతను ప్రైవేట్‌ సంస్థలు తీసుకుంటాయి. మనం కూడా ఆ దిశలోనే ప్రయాణిస్తున్నాం. మేము తయారుచేసి ఇచ్చిన డిజైన్‌లకు తగిన టెక్నాలజీలను ప్రైవేట్‌ సంస్థలు రూపొందించి ఇస్తున్నాయి. వాటిని మేము మా డిజైన్‌తో అనుసంధానం చేస్తున్నాం. భవిష్యత్తులో రక్షణ రంగ దిగుమతులు తగ్గుతాయి కాబట్టి ఈ అవసరాలు మరింత పెరుగుతాయి.  ప్రైవేట్‌ భాగస్వామ్యం కీలకమవుతుంది.

రక్షణ రంగంలో యువత పాత్రను పెంచేందుకు ఎలాంటి వ్యూహాలను అమలుచేస్తున్నారు?

డీఆర్‌డీఓ రూపొందించే ప్రతి వ్యవస్థలోను యువతీ యువకులది కీలకమైన పాత్రే! ఈ మధ్య కాలంలో మేము చేసిన అనేక ప్రయోగాల్లో ఈ యువ శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉంది. దీనిని మేము గుర్తిస్తున్నాం. గుర్తించటమే కాదు. వారికి ఆ విషయాన్ని రకరకాలుగా తెలియజేస్తున్నాం. దీనితో వారిలో సంస్థ పట్ల నిబద్ధత బాగా పెరిగింది. ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు.. స్టార్టప్‌ కంపెనీలకు డీఆర్‌డీఓ ఎంతో ప్రోత్సాహం ఇస్తోంది. తాజాగా మేము రూపొందించిన కొవిడ్‌-19 వైరస్‌ నివారణ ఉత్పత్తులలో కొన్నింటినీ ఈ స్టారప్‌ కంపెనీలే తయారుచేస్తున్నాయి. ఈ చర్యల ప్రభావం దీర్ఘకాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. 

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-07T08:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising