ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌లో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌

ABN, First Publish Date - 2020-06-18T09:45:49+05:30

వర్షాకాలం నేపథ్యంలో హరితహారం నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్డుల వారీగా.. హరిత ప్రణాళిక

మొక్కల పెంపకంపై 

జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి

కార్పొరేటర్ల సహకారంతో 

యాక్షన్‌ ప్లాన్‌


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో హరితహారం నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. కార్పొరేటర్ల సహకారంతో వార్డుల వారీగా మొక్కలు నా టడం, సంరక్షణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. మొక్కల సంరక్షణలో సంస్థ ఉద్యోగులను భాగస్వాములను చేయనున్నారు. గతంలో నాటిన మొక్కలు చాలా వరకు ఎండిపోవడంతో ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. యాదాద్రి మోడల్‌లో హెక్టార్‌ భూమిలో వరుసలుగా వేర్వేరు రకాల ఎత్తుండే 40 వేల మొక్కలు నాటారు. అదే తరహాలో గ్రేటర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలంలో వీలైన న్ని ఎక్కువ మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు బుధవారం కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ జోనల్‌, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలివి. 

  • కాలనీ సంక్షేమ సంఘాలను ప్లాంటేషన్‌, సంరక్షణలో భాగస్వాములను చేయాలి. 
  • ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మొక్కలు నాటాలి. 
  • గుంతలు తీయించడం, మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు ప్రాంతాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించాలి. 
  • నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ఫెన్సింగ్‌, నీరు పోసేందుకు, కలుపుతీత పనుల పరిశీలన బాధ్యత ఇన్‌చార్జ్‌లదే. 
  • ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద గ్రేటర్‌లో అన్ని రోడ్లు కలిపి 9,300 కి.మీల మేర ఉన్నాయని, అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలి. 
  • రహదారుల పక్కన స్థలం తక్కువగా ఉంటే.. సంబంధిత ఇంటి యజమానితో మాట్లాడి ప్రహరీ లోపల మొక్కలు నాటించాలి. 
  • ప్రధాన రహదారులు 709 కి.మీల మేర సెంట్రల్‌ మీడియన్లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. 
  • మెట్రో రైల్‌ మార్గంలో మాత్రం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ మొక్కలు నాటుతుంది. 
  • శ్మశాన వాటిక ప్రహరీలు, గ్రీన్‌ కర్టెన్లను తలపించేలా ప్రత్యేక మొక్కలు నాటాలి.
  • లే అవుట్‌ ఖాళీ ప్రదేశాలు, ఇతర ఓపెన్‌ స్పేస్‌ల్లో యాదాద్రి మోడల్‌ తరహాలో మొక్కలు నాటాలి. 
  • లే అవుట్‌లో బయో ఫెన్సింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • నాలాలకు ఇరువైపులా మొక్కలు నాటాలి. 
  • మూసీకి ఇరువైపులా మొక్కలు నాటాలి. 
  • చెరువు కట్టలకు ఇరువైపులా నీరు నిలవని ప్రాంతాల్లో మొక్కలు నాటాలి. 

Updated Date - 2020-06-18T09:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising