ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్పొరేటర్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్వీట్‌

ABN, First Publish Date - 2020-12-07T17:05:06+05:30

గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్‌ ఎ.పావనీవిజయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ స్వీట్‌ తినిపించి, అభినందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి: గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్‌ ఎ.పావనీవిజయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ స్వీట్‌ తినిపించి, అభినందించారు. ఈ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. ఐదు డివిజన్లలో బీజేపీ విజయపతాక ఎగురవేసింది. ముఖ్యంగా గాంధీనగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే మరదలు ముఠా పద్మ పోటీ చేశారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి ఎ.పావనీవిజయ్‌కుమార్‌ విజయం సాధించారు. కాగా, ఆదివారం డివిజన్‌లోని జవహర్‌నగర్‌లో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనానికి గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ఎ. పావనివినయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించి స్వీట్‌ తినిపించడంతో అక్కడ ఉన్న వారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తన మరదలిని ఓడించిన కార్పొరేటర్‌ను ఎమ్మెల్యే ప్రశంసించడంతో.. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్న దానికి ఇది ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-07T17:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising