ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లలను కాపాడుకోవాలి : విశ్రాంత జస్టిస్‌ చంద్రకుమార్‌

ABN, First Publish Date - 2020-03-08T10:55:07+05:30

ఆడబిడ్డలను కాపాడుకుంటూ మహిళలకు సమాజంలో సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వా లు, సమాజంపై ఉందని విశ్రాంత జడ్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌(ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డలను కాపాడుకుంటూ మహిళలకు సమాజంలో సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వా లు, సమాజంపై ఉందని విశ్రాంత జడ్జి జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్ర అగ్రికల్చ ర్‌ అండ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ తిప్పనేని రామదాసప్పనాయుడు ఆధ్వర్యంలో శనివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ‘ఆడబిడ్డలను కాపాడుకుందాం-మహిళలను గౌరవిద్దాం’ అంశంపై చర్చా వేదిక జరిగింది. రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన బడ్జెట్‌ కేటాయించాలని సూచించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త తిరునగరి జ్యోత్స్న, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు ఈఎ్‌సవీవీ మాధవి, సీనియర్‌ పాత్రికేయురాలు బిక్కి కృష్ణలు మా ట్లాడారు. రామదాసప్పనాయుడు మాట్లాడుతూ ముద్ర కో-ఆపరేటివ్‌ బ్యాంకు ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురైన ఓ దినపత్రిక ఫొటోగ్రాఫర్‌ రవికుమార్‌కు రూ. 5వేల ఆర్థిక సహా యం అందజేశారు. కార్యక్రమంలో ముద్ర బ్యాంకు సీఈవో వెంకటేశ్వర్లు, బ్యాంకు డైరెక్టర్లు జి.జ్యోతి, ఆర్‌.శాంతి, బి.కోటయ్య, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T10:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising