ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి’

ABN, First Publish Date - 2020-10-03T09:24:58+05:30

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిన సీఎం యోగి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవాడిగూడ, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిన సీఎం యోగి  ఆదిత్యనాఽథ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాల ని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం డిమాండ్‌ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తుల చేతి లో అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని, బెదిరింపులకు గురిచేస్తున్న అధికారులు, పోలీసులపై తక్షణ మే చర్యలు తీసుకోవాలన్నారు. యువతి మృతి కి బాధ్యత వహిస్తూ యూపీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పీవోడబ్ల్యూ, పీడీఎ్‌సయూల సంయుక్తాధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఇందులో పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరళ, నగర మహిళా నాయకురాలు జయసుధ, అనురాధ, ముంతాజ్‌, పుణ్యవతి, పీడీఎ్‌స్‌యూ రాష్ట్ర నాయకులు రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో..

అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను, రాష్ట్రంలోని మెయినాబాద్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాత్రి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని  అంబేడ్కర్‌ విగ్రహం వద్ద హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఐద్వానగర కార్యదర్శి అరుణజ్యోతి, టీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి మహేందర్‌, ఎస్‌ఎ్‌ఫఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశో క్‌, విజయ్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌, ఎన్‌పీఆర్డీ కార్యదర్శి వెంకటేష్‌, వివిధ సంఘాలనేతలు మహ్మద్‌, నరేష్‌, మారన్న, మల్లేష్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 


అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో..

నల్లకుంట: ఉత్తరప్రదేశ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే ఉరితీయాలని అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంపంగి పద్మక్క, అరుణ డిమాండ్‌ చేశారు. యూపీ సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదర్‌గూడలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  

Updated Date - 2020-10-03T09:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising