ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ

ABN, First Publish Date - 2020-10-04T09:57:41+05:30

నేడు సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరంలో 99 పరీక్ష కేంద్రాలు

మొత్తం 46,171 మంది అభ్యర్థులు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో మొత్తం 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 46,171 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 


పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతోపాటు 99 మంది లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉండనున్నారు. 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.  పరీక్షకు హాజరయ్యే వారు కొవిడ్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కలెక్టర్‌ కోరారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.


అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఎండీ ఈడీ వి.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు  సమాచారం కోసం కోఠి బస్టాండ్‌ 99592 26160, రేతిఫైల్‌ బస్టాండ్‌ 99592 26154 నెంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.   

Updated Date - 2020-10-04T09:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising