ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్ట్‌ గోవిందరాజులు హఠాన్మరణం

ABN, First Publish Date - 2020-10-04T09:54:29+05:30

‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్ట్‌ గోవిందరాజులు హఠాన్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌3 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’లో చీఫ్‌-సబ్‌-ఎడిటర్‌గా పనిచేస్తున్న బెజవాడ గోవిందరాజులు శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఇంటి మెట్ల మీద గుండెపోటుతో కూలిపోవడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. విజయ్‌నగర్‌ కాలనీలోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. గుంటూరు జిల్లాలో డిగ్రీ పూర్తి చేసుకున్న ఆయన వివిధ పత్రికల్లో ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పనిచేశారు. అనంతరం 2002లో ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. గుంటూర్‌ ఎడిషన్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2008 నుంచి ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్‌ సిటీడె్‌స్కలో పనిచేస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కే శ్రీనివాస్‌, వివిధ విభాగాల అధిపతులు వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనకు భార్య హేమలత, కుమార్తె బాలభవ్య ఉన్నారు. 

Updated Date - 2020-10-04T09:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising