ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2020-10-25T07:16:57+05:30

దసరా ఉత్సవాలు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం పురస్కరించుకుని బందోబస్తు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌24(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాలు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం పురస్కరించుకుని బందోబస్తు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. ఆదివారం హుస్సేన్‌సాగర్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో కొన్ని ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపా రు. ఆంక్షలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లో ఉంటాయి. 

  • ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ నుంచి ఎన్‌టీఆర్‌ మార్గ్‌వైపు వాహనాలకు నో ఎంట్రీ, ఆయా వాహనాలను నిరంకారివైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్‌మినార్‌, లిబర్టీ, తెలుగుతల్లి జంక్షన్‌ల నుంచి ఎన్‌టీఆర్‌ మార్గ్‌లవైపు వాహనాలకు అనుమతి ఉండదు.
  • పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్‌ రోడ్‌ల మీదుగా వచ్చే వాహనాలు నిరంకారి, సైఫాబాద్‌ పాత పీఎస్‌, ఇక్బాల్‌మినార్‌, అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా సికింద్రాబాద్‌, బషీర్‌బాగ్‌ వైపు వెళ్లాలి. 
  • ఇక్బాల్‌ మినార్‌, లిబర్టీ, తెలుగుతల్లి విగ్రహం మీదుగా వచ్చే వాహనాలు సైఫాబాద్‌ పీఎస్‌, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం, ఖైరతాబాద్‌ల వైపు వెళ్లాల్సి ఉంటుంది. 
  • సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలు చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతిస్తారు.

Updated Date - 2020-10-25T07:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising