ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ పత్రాలతో ఆర్‌బీఎల్‌ బ్యాంకుకు టోకరా

ABN, First Publish Date - 2020-10-01T09:11:23+05:30

నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న కేసులో ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2015లో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న కేసులో ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2015లో జరిగిన ఈ నేరానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరానికి చెందిన మన్నెం వినోద, మన్నెం మధుకర్‌ రెడ్డి భార్యాభర్తలు. వారిద్దరితో పాటు ఎ.బాల్‌రెడ్డి, మోయిజ్‌పాషా, గుజ్జ నరసింహారెడ్డి, మరికొందరు కలిసి బ్యాంకు నుంచి రుణం పొందేందుకు 2015లో ప్లాన్‌ చేశారు.


అమల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, షేరిగూడ గ్రామం చిరునామాపై అర్జున్‌ పౌలీ్ట్రఫామ్‌ పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. దానికి సంబంధించిన 2.08ఎకరాల భూమి నకిలీ పత్రాలు (సెకండ్‌ రిజిస్ట్రేషన్‌) ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ శాఖలో సమర్పించారు. వారి పత్రాలను నమ్మిన బ్యాంకు అధికారులు రూ. 3.7కోట్లు రుణం మంజూరు చేశారు. ఆ తర్వాత కొంతవరకు చెల్లించిన నిందితులు ఆ తర్వాత నిలిపివేశారు.


వారి వల్ల బ్యాంకుకు రూ. 2.72కోట్లు నష్టం వాటిల్లింది. అధికారులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు చేపట్టిన అధికారులు మన్నెం మధుకర్‌రెడ్డి, మోయిజ్‌ పాషాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2020-10-01T09:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising