ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలి

ABN, First Publish Date - 2020-09-25T07:29:02+05:30

ఆటో, ట్రాలీ, క్యాబ్‌, డీసీఎం యజమానులపై ప్రైవేట్‌ ఆటో ఫైనాన్సర్ల వేధిం పులను నిరసిస్తూ గురువారం తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆటో, ట్రాలీ, క్యాబ్‌, డీసీఎం యజమానులపై ప్రైవేట్‌ ఆటో ఫైనాన్సర్ల వేధిం పులను నిరసిస్తూ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ రవాణా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖైరతా బాద్‌లోని కుషాల్‌ టవర్స్‌ ఎదుట బీఎంఎస్‌, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎన్‌టీయూసీ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్యలతోపాటు పలు సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆటో, ఇతర ప్రైవేట్‌ వాహనాల యజమానులు, డ్రైవర్లపై ఇటీవలి కాలంగా వేధింపులు అధికమవుతున్నాయని, మూడు నెలలుగా కొవిడ్‌ నేపథ్యంలో ఆటో డ్రై వర్ల వ్యాపారం పడిపోయిందని యూనియన్‌ నాయకులు సత్తిరెడ్డి, రవిశంకర్‌ వాపోయారు. ప్రభుత్వం స్పందించి ప్రైవేట్‌ ఫైనాన్సర్ల వేధిం పులను అరికట్టాలని కోరారు. ఆందోళన తర్వాత ఫైనాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రోహిత్‌  డీజీపీ ఓఎస్‌డీలను కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.  

Updated Date - 2020-09-25T07:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising