ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారిదోపిడీ కథ అల్లిన నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2020-05-28T09:26:37+05:30

డబ్బు కాజేసి దారిదోపిడీ కథ అల్లిన నిందితుడిని ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 8,51,950 స్వాధీనం


కొత్తపేట, మే 27 (ఆంధ్రజ్యోతి): డబ్బు కాజేసి దారిదోపిడీ కథ అల్లిన నిందితుడిని ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 8,51,950 స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడ శ్రీ సాయిచరణ్‌ పేపర్‌మిల్స్‌లో మారం అచ్చిరెడ్డి(28) అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 25న నగరంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్ల వద్ద రూ. 8.50 లక్షలు వసూలు చేసుకొని వెళ్తుండగా గుర్రంగూడ - నాదర్‌గుల్‌ దారిలో తెల్లటి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నగదు లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించగా అతడు కట్టుకథ అల్లినట్లు తేలింది. ప్రేమించిన యువతి వైద్యం కోసం దారిదోపిడీ కథ అల్లినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడు గుర్రంగూడ సమీపంలో పొదల్లో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో దాచిన రూ. 8.50 లక్షలు, అతడి నుంచి రూ. 1,950 స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించిన యువతి వైద్యం ప్రస్తావన కూడా కట్టుకథేనా అని విచారిస్తున్నామని డీసీపీ చెప్పారు. 

Updated Date - 2020-05-28T09:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising