నైజీరియాలో తెలుగు వ్యక్తి మృతి.. వీడియో కాల్ మాట్లాడిన మరుసటి రోజే..
ABN, First Publish Date - 2020-06-18T15:21:35+05:30
వ్యాపారం నిమిత్తం నైజీరియా వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీసర్ల మధుసూదన్‌రెడ్డి(29) హయత్‌నగర్
నైజీరియాలో నగరవాసి మృతి
హయత్‌నగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వ్యాపారం నిమిత్తం నైజీరియా వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీసర్ల మధుసూదన్‌రెడ్డి(29) హయత్‌నగర్ శాంతినగర్ కల్వంచలో నివసిస్తున్నాడు. నాలుగేళ్లుగా నైజీరియాలో బోరు బావులను తవ్వే వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఊపిరాడకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అబుజా సిటీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరుగంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ద్వారా మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
మధుసూదన్‌రెడ్డి మృతి విషయం తెలియగానే శాంతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య స్వప్న, కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడు నాలుగు నెలలకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడని, మంగళవారం వరకు వీడియో కాల్‌లో మాట్లాడాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2020-06-18T15:21:35+05:30 IST