ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ : మరో రెండు ఆస్పత్రులపై త్వరలో ప్రభుత్వం కొరడా!

ABN, First Publish Date - 2020-08-04T22:20:18+05:30

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోజురోజుకు మరింత దారుణంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేయగా కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రిపై చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


మరో రెండు ఆస్పత్రులపై..!

ఇవాళ కూడా మరో రెండు ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు పలు ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే.. తప్పు చేసినట్లు రుజువు అయితే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆ రెండు కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే విషయంపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఆ రెండు కార్పొరేట్ ఆస్పత్రులేవి..? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తానికి చూస్తే డెక్కన్ ఆస్పత్రితో మొదలైన వేటు మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై పడనుందన్న మాట.

Updated Date - 2020-08-04T22:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising