ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలిచినా..ఓడినా కాంగ్రెస్‌లోనే ఉంటా: శ్రీనివాస్ రెడ్డి

ABN, First Publish Date - 2020-11-03T16:58:32+05:30

తాను కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నేలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తాను కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నేలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను టీఆర్ఎస్‌లో చేరినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో ఎప్పటికీ చేరనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గెలిచినా.. ఓడినా కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. 


బీజేపీ నేత రఘునందన్‌రావు, మంత్రి హరీష్ రావు కలిసి ఓటమి భయంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్యంటూ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్‌ను ప్రజలు నమ్మవద్దని కోరారు. చిన్న గొడవ జరిగితే గత రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నానని, తన వెనుక పోలీస్ షాడో టీమ్ కూడా ఉందని ఆయన చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నాయన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తన తండ్రిపై ప్రమాణం చేసి ప్రతి గ్రామంలో చెప్పానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-03T16:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising