ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హేమంత్ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలం : సీపీ సజ్జనార్

ABN, First Publish Date - 2020-09-29T22:04:05+05:30

హేమంత్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : హేమంత్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో గంటకో ట్విస్ట్, సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. తాజాగా.. ఈ కేసుపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోందని సీపీ వెల్లడించారు.


కాగా.. ఈ కేసులో యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను ఆరు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 14 మందిని గచ్చి బౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు గంటలుగా అవంతి కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. హేమంత్ హత్య కేసుపై అవంతి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ కేసులో  మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. ఇప్పటికే 14 మందికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడం జరిగింది.

Updated Date - 2020-09-29T22:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising