ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫొటో ఫ్రేం లామినేషన్‌ వర్క్‌షాప్‌ గోదాంలో..షార్ట్‌ సర్క్యూట్‌

ABN, First Publish Date - 2020-06-18T09:54:36+05:30

ఫొటో ఫ్రేం లామినేషన్‌ వర్క్‌షాప్‌ గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిపోయిన సామగ్రి


అఫ్జల్‌గంజ్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఫొటో ఫ్రేం లామినేషన్‌ వర్క్‌షాప్‌ గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. టోప్‌ఖానా ప్రాంతానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి 20 ఏళ్లుగా గోషామహల్‌ విద్యుత్‌ డీఈ కార్యాలయంలో వెనుక ఓ గోదాంలో ఫొటో ఫ్రేం లామినేషన్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో గోదాం నుంచి పొగరావడంతోపాటు మంటలు ఎగసిపడ్డాయి.


గమనించిన స్థానికులు పోలీసులు, గౌలిగూడ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. డీఎ్‌ఫవో శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఎ్‌ఫవో రాజ్‌కుమార్‌గౌడ్‌ గౌలిగూడ నుంచి మూడు, అసెంబ్లీ నుంచి ఒక ఫైరింజన్‌ను ఘటనా స్థలానికి రప్పించి ఉదయం 10 గంటలకు మంటలు పూర్తిగా అదుపు చేశారు.  అగ్నిప్రమాదంలో సామగ్రి, ఫర్నిచర్‌ కాలిపోయింది. షాహినాయత్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


ఆందోళనతో యజమానికి గుండెపోటు 

గోదాంలో అగ్నిప్రమాదం జరగడం, లక్షల రూపాయల ఆస్తి మంటల్లో కాలిపోవడంతో ఆందోళనకు గురైన యజమాని బ్రహ్మం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-18T09:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising