ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో లేడీస్‌ సీట్లో నుంచి అతడిని లేవమన్నందుకు..

ABN, First Publish Date - 2020-02-18T16:49:51+05:30

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటన బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళపై కత్తితో దాడి

అఫ్జల్‌గంజ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటన బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన అనురాధ(40) పని నిమిత్తం బస్సులో చాంద్రాయణగుట్ట వెళ్తోంది. బస్సులో మహిళల సీట్లో కూర్చున్న వ్యక్తిని.. ఇది మహిళలకు కేటాయించిన సీటని, లేవమని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో అతడు తన వద్ద ఉన్న కత్తితో అనురాధపై దాడి చేసి రన్నింగ్‌లో ఉన్న బస్సులో నుంచి దూకి పారిపోయాడు. గాయపడిన ఆమెను డ్రైవర్‌ అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌ పీజీ రెడ్డి అనురాధను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేయించి వివరాలు సేకరించారు. ఘటన గాంధీభవన్‌ వద్ద జరగడంతో అఫ్జల్‌గంజ్‌ పీఎ్‌సలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Updated Date - 2020-02-18T16:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising