ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో ఏడుగురి అరెస్టు

ABN, First Publish Date - 2020-09-14T09:55:32+05:30

కిషన్‌బాగ్‌ నివాసి జావీద్‌(40) హత్య కేసులో ఏడుగురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): కిషన్‌బాగ్‌ నివాసి జావీద్‌(40) హత్య కేసులో ఏడుగురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్యకు డబ్బు వివాదమే కారణమని తెలిసింది. ఈ నెల 8న రాత్రి జావీద్‌ను హత్య చేసిన వారిలో కొందరికి నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక ఐ20 కారు, పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు. జావీద్‌కు తెలిసిన మహిళకు అన్సారీ రోడ్‌కు చెందిన లేడీస్‌ చెప్పుల షాపు నిర్వాహకుడు సయ్యద్‌ ఇర్ఫాన్‌ (23) రూ.5 లక్షల చిట్టి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు ఇవ్వమంటే తప్పిం చుకు తిరుగుతున్నాడు.


ఆ మహిళ భర్త కత్తర్‌లో ఉంటుండడంతో ఆమె మూడు నెల లు హైదరాబాద్‌లోని అన్సారీ రోడ్‌లో, మరో మూడు నెలలు కత్తర్‌లో ఉంటోంది. దీం తో ఆ మహిళ చిట్టి డబ్బుల వసూలు విషయాన్ని జావీద్‌కు అప్పగించింది. దీంతో జావీద్‌ పలుమార్లు ఇర్ఫాన్‌ వద్దకెళ్లి డబ్బులు అడగ్గా విడతల వారీగా రూ.3లక్షల వరకు ఇచ్చాడు. మిగతా రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంది. పది రోజుల క్రితం కిషన్‌బాగ్‌ లో జావీద్‌ ఇర్ఫాన్‌ను డబ్బుల కోసం గట్టిగా అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.


ఆవేశంలో డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని జావీద్‌ ఇర్ఫాన్‌ను బెదిరించాడు. అది మనస్సులో పెట్టుకున్న ఇర్ఫాన్‌ ఆ విషయాన్ని తన చెప్పుల షాపులో పనిచేసే వ్యక్తులకు, తెలిసిన వ్యక్తులకు చెప్పాడు. వారందరూ కలిసి జావీద్‌ను చంపాలని నిర్ణయిం చుకున్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగా తనకు ఓ ప్లాట్‌ ఉందని దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులు ఇస్తానని ఇర్ఫాన్‌ జావీద్‌ను నమ్మబలికాడు. ఈ నెల 8న ఇర్ఫాన్‌ జావీద్‌కు ఫోన్‌ చేసి ఆరాంఘర్‌ రమ్మన్నాడు. తాను అక్కడికి రాలేనని శివరాంపల్లి వస్తానని చెప్పడంతో ఇర్ఫాన్‌ సరేనన్నాడు. జావీద్‌ రాత్రి 9 గంటల సమయంలో శివరాంపల్లి ప్రజాభవన్‌ వద్దకు రాగానే అతడికి భూమి కాగితాలు చూపిస్తున్నట్లు ఇర్ఫాన్‌ నటించాడు. అప్పటికే ఐ20 కారులో వచ్చి పక్కనే కూర్చున్న ఇర్ఫాన్‌ స్నేహితులు జావీద్‌ను పట్టుకోగా ఇర్ఫాన్‌ జావీద్‌పై కత్తులతో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం అక్కడే పల్సర్‌ బైక్‌ను వదిలి పారిపోయారు.


ఈ హత్య కేసుతో సంబంధమున్న అన్సారీరోడ్డుకు  చెందిన సయ్యద్‌ ఇర్ఫాన్‌(23)తోపాటు అన్సారీరోడ్డు, హసన్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ అతాహుల్లా అలియాస్‌ షాజాహనుల్లా(23), షేక్‌ ఖాలేద్‌(23), మహ్మద్‌ జియావుద్దీన్‌(24), మహ్మద్‌ వాసీమ్‌(24), మీర్‌ అష్రఫ్‌ అలీ (21), కిషన్‌రావు(24)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకేసులో పాల్గొన్న వారిలో మహ్మద్‌ అతావుల్లా కాలాపత్తర్‌ ఠాణా పరిధిలో ఓ హత్యకేసులో నిందితుడు కాగా, షేక్‌ కాలేద్‌ ఫలక్‌నుమా ఠాణాలో రౌడీషీట్‌ తెరిచారు.

Updated Date - 2020-09-14T09:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising