పది స్టార్టప్ సంస్థలు ఎంపిక
ABN, First Publish Date - 2020-08-11T09:58:44+05:30
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్(ఏఐసీ) తమ ప్లాంట్‌ఫాం నుంచి
రాయదుర్గం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్(ఏఐసీ) తమ ప్లాంట్‌ఫాం నుంచి స్టార్టప్ సంస్థలకు సహకారం అందించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని స్టార్టప్ సంస్థలను ఎంచుకుంటుం ది. ఏఐసీ నుంచి దరఖాస్తులు పొందిన స్టార్టప్ సంస్థలను పలు దఫాలుగా వడపోత (వివిధ రౌండ్లలో పరీక్షించి) ద్వారా పది కంపెనీలను ఎంచుకుని ఆయా సంస్థలకు ప్రోత్సాహాన్ని అం దిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడా ది 17 నగరాల నుంచి వంద స్టార్టప్ సంస్థలు దరఖాస్తు చేసుకోగా పలు దఫాలుగా నిర్వహించిన వడబోత ద్వారా అంతిమంగా పది సంస్థల ను ఎంపిక చేసుకుంది. ఈ స్టార్టప్ సంస్థలకు కావాల్సిన మూలధన సేకరణ, పెట్టుబడిదారు లను ఆకర్షించేందుకు కావాల్సిన వేదిక, టెక్నా లజీ, అనుభవ సహాయ సహకారాలను ఏఐసీ ముందుండి అందిస్తుంది.
అడ్వాఎన్విరో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్‌సిట్, ఎస్‌డీజీ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, కొటుంబు డిజిటల్ ఎన్విరాన్‌మెంట్ అండ్ కెరియర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకోర్యాప్, ఐఆటా ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మయూక్ ఐ, డీజీబీ ఈంగ్, జీవన్‌దీ్‌ప్ హెల్త్ సర్వీసెస్, కయినోస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంపికయ్యాయి. ఎంపికైన ఈ పది సంస్థలకు ఏఐసీ డైరెక్టర్ రమేష్ లోకనాథన్ అభినందనలు తెలిపారు.
Updated Date - 2020-08-11T09:58:44+05:30 IST