ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T06:00:24+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని రెడ్డి విమెన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మన్సూరాబాద్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని రెడ్డి విమెన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నాగోలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అగ్రవర్ణాల్లో ఎంతోమంది పేదలు ఉన్నారని, రిజర్వేషన్లు అమలు చేయకపోవటంతో విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోందని, మొదట ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలుచేసిన తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నందికొండ గీతారెడ్డి, ఉపాధ్యక్షురాలు చెర త్రివేణిరెడ్డి, శోభా దామోదర్‌రెడ్డి, లావణ్యారెడ్డి, ప్రణీతారెడ్డి, మోతే కవిత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising