ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెమెరాల దొంగకు రిమాండ్‌

ABN, First Publish Date - 2020-07-08T09:27:41+05:30

కెమెరాల దొంగను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి తొమ్మిది కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడ్‌మెట్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కెమెరాల దొంగను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి తొమ్మిది కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం భాగ్యలత కాలనీలో నివసిస్తున్న మేకల ప్రశాంత్‌రెడ్డి(23) జల్సాలకు అలవాటుపడ్డాడు. కెమెరాలు దొంగిలించి ఆధార్‌ కార్డును రుజువుగా చూపించి ఓఎల్‌ఎక్స్‌ ద్వారా అమ్ముతున్నాడు. రెండు మూడు రోజుల తర్వాత ఫోన్‌ సిమ్‌కార్డు మార్చేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 7వ తేదీన సికింద్రాబాద్‌లో కెమెరాలను అమ్ముతుండగా నేరేడ్‌మెట్‌ రక్రైం పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నాలుగున్నర లక్షల రూపాయల విలువగల తొమ్మిది కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్‌రెడ్డిపై నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2019, 2020లో రెండు కేసులు, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2016, 2018లో, చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో 2017లో, చాంద్రాయణగుట్ట పీఎ్‌సలో 2016లో రెండు కేసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌, మైలార్‌దేవ్‌పల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లోని పెందుర్తి తదితర పోలీస్‌ స్టేషన్‌ల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని సీఐ నరసింహస్వామి తెలిపారు.  

Updated Date - 2020-07-08T09:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising