ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో చేరిన కొన్ని రోజులకే ఆయన బదిలీ.. మర్మమేంటో..?

ABN, First Publish Date - 2020-08-14T14:28:49+05:30

బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జలమండలి మేనేజర్‌గా పనిచేస్తున్న రమే్‌షను విధుల్లో చేరిన కొన్ని రోజులకే మెహిదీపట్నం సెక్షన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీ వెనుక కారణాలపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలమండలి మేనేజర్‌ రమేష్‌ బదిలీలో మర్మమేమి?


నార్సింగ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జలమండలి మేనేజర్‌గా పనిచేస్తున్న రమే్‌షను విధుల్లో చేరిన కొన్ని రోజులకే మెహిదీపట్నం సెక్షన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీ వెనుక కారణాలపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. బండ్లగూడ మున్సిపల్‌లోని ఓ కాలనీలో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదంలేని పని చేయించారని అందుకు కొన్ని లక్షల్లో బిల్లు పెట్టారని సమాచారం. అయితే మున్సిపల్‌ అధికారుల అనుమతిలేకుండా పని చేయించడంతోపాటు బిల్లు కాం ట్రాక్టర్‌తో పెట్టించడంతో మున్సిపల్‌ అధికారులు జలమండలి ఉన్నతాధికారులకు సమాచారం ఇ చ్చారు. దీంతో రమే్‌షను బదిలీ చేశారని ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం రమేష్‌ బదిలీ కావడంతో మణికొండ జలమండలి మేనేజర్‌ నరేందర్‌రెడ్డికే బండ్లగూడ జలమండలి బాధ్యతలు అప్పగించా రు. దీనిపై జలమండలి జనరల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా రమే్‌షను సాధారణంగానే బదిలీ చేశామని ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బండ్లగూడ మున్సిపల్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్‌ను అడగాలన్నారు. ఏ అధికారిని అయినా రెండు, మూడు సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తారు. మరి రమే్‌ష ను ఇంత తక్కువ సమయంలోనే బదిలీ చేయడం ఎందుకో మున్సిపల్‌, జలమండలి అధికారులకే తెలియాలి.  

Updated Date - 2020-08-14T14:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising