ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీహెచ్‌సీలకు తాకిడి.. విస్తృతంగా ర్యాపిడ్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-07-18T13:19:09+05:30

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యా పిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహించే పరీక్షల్లో 17నుంచి18 శాతం లోపు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కో రోజే 3,782 మందికి.. 

657 మందికి పాజిటివ్‌ 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యా పిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహించే పరీక్షల్లో 17నుంచి18 శాతం లోపు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా పరిధిలో శుక్రవారం 80 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీ) మొత్తం 3,782 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 657 మందికి పాజిటివ్‌గా తేలింది. పది రోజులుగా మొత్తం 20,935 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా, 3,467 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. 17,468 మందికి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.


ఒక్కో యూపీహెచ్‌సీ పరి ధిలో రోజుకు 25 మందికి మాత్రమే ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశముంటుంది. ఒక రోజు ముందుగా వచ్చి దరఖాస్తులు పూర్తి చేసిన వారికి మాత్రమే మరుసటి రోజు పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలు అరగంటలోనే వస్తుండటంతో చాలా మంది ఈ పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో యూపీహెచ్‌సీల వద్ద జనం తాకిడి పెరిగింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోనూ రోజూ 250 మంది నుంచి నమూనాలు సేక రించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-07-18T13:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising