ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రచారంలో ఎదురుపడ్డ బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-27T19:05:03+05:30

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. కేపీహెచ్‌బీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. కేపీహెచ్‌బీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎదురెదురుగా ర్యాలీలు రావడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.  ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎంఐఎం, టీఆర్ఎస్‌లేనన్నారు. ప్రతి ఎన్నికల్లో రోహింగ్యాల ఓట్లతో ఎంఐఎం గెలుస్తుందన్నారు. అక్రమ చొరబాటు దారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తించి.. తన ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారన్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-11-27T19:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising