ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌ జోష్‌ షురూ.. !

ABN, First Publish Date - 2020-09-27T09:49:19+05:30

పబ్‌ జోష్‌ షురూ.. !

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బంజారాహిల్స్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సుమారు 180 రోజుల తర్వాత కొన్ని పబ్‌లు శనివారం తెరుచుకున్నా యి. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బార్లు, క్లబ్‌లు తెరుచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. అయితే, ప్రభుత్వాలు బార్లు, క్లబ్‌లు మాత్రమే తెరవాలని చెప్పాయి. పబ్‌ల విషయం ప్రస్తావించలేదు. దీంతో నిర్వాహకుల్లో గందరగోళం నెలకొంది. పబ్‌లకు ప్రత్యేక లైస్సెన్స్‌లు ఉం డవు. బార్‌ లైసెన్స్‌ మీద నడిపించాల్సి ఉంటుంది. ప్రభు త్వం బార్లకు అనుమతి ఇవ్వడంతో కొంత మంది పబ్‌ నిర్వాహకులు శనివారం ఉదయం నుంచి ఏర్పాట్లు మొదలు పెట్టారు. మరికొందరు పోలీసులను ఆశ్రయించగా, వారి వద్ద నుంచి స్పష్టత రాలేదు. డ్యాన్స్‌ ఫ్లోర్‌, పార్టీలు నడిపిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లో శనివారం నాలుగు పబ్‌లు తెరుచుకున్నాయి. తినుబండారాలు, మద్యం మాత్రమే సరఫరా చేస్తున్నట్టు సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత పబ్‌లు తెరుచుకోవడం, వీకెండ్‌ కావడంతో పబ్‌ల వద్ద కాస్త సందడి కనిపించింది. పార్టీ ప్రియులు పబ్‌లో గడిపేందుకు మొగ్గు చూపించారు.  

Updated Date - 2020-09-27T09:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising