ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాప్రస్థానానికి సాగిన అంతిమ యాత్ర

ABN, First Publish Date - 2020-03-06T08:45:25+05:30

సీనియర్‌ పాత్రికేయులు, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఉదయం నగరంలోని విజయనగర్‌కాలనీ, పీఎ్‌సనగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెహిదీపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయులు, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఉదయం నగరంలోని విజయనగర్‌కాలనీ, పీఎ్‌సనగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఈ వార్త విన్న మీడియా రంగంతోపాటు పలువురు కవులు, సీనియర్‌ పాత్రికేయులు, పలువురు సంపాదకులు, పలు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున హాజరై ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళిలు అర్పించారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివా్‌సతో పాటు ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, టీయూడబ్య్లూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్‌ ఆలీ, కార్యవర్గ సభ్యులు ఎ. రాజేశ్‌, హెచ్‌యూజే నగర కార్యదర్శి శంకర్‌గౌడ్‌, సీనియర్‌ జర్నలిస్టులు, ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌, సాంపదకులు చిలుకూరి వీరయ్య, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీపీఆర్‌వోగా పనిచేస్తున్న జ్వాల నర్సింహరావుతోపాటు తదితరులు పొత్తూరి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


పొత్తూరి అంత్యక్రియలను రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించారు. సాయంత్రం 4:30 గంటలకు స్వర్గపురి వాహనంలో అంతిమ యాత్ర పీఎ్‌సనగర్‌లోని ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరింది. మాసబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, రేతిబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా మీదుగా ఈ అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బంధువులు, ఇతర పాత్రికేయులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అంతిమ యాత్రలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-06T08:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising