తలసీమియా వ్యాధిగ్రస్థులకు అండగా పోలీసులు
ABN, First Publish Date - 2020-06-18T09:57:02+05:30
తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, కేన్సర్, డయాలసిస్, యాక్సిడెంట్ అయిన వారు రక్తం లేకపోవడంతో ప్రాణాలు
రక్తదానం చేసిన 50 మంది
హైదరాబాద్ సిటీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, కేన్సర్, డయాలసిస్, యాక్సిడెంట్ అయిన వారు రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. బుధవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉస్మానియా ఆస్పత్రి, తలసీమియా సిక్లీసెల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలు పోలీ్‌సస్టేషన్ల నుంచి 50 మంది సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేయాలనుకున్న వారు 7901125460 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సీపీ కోరారు. కార్యక్రమంలో సైబరాబాద్ కార్‌హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-18T09:57:02+05:30 IST