కొడుకు ఇటలీ నుంచి వచ్చాడు... తండ్రికి గాంధీలో కరోనా పరీక్షలు
ABN, First Publish Date - 2020-03-16T17:00:27+05:30
కరోనా అనుమానంతో సాధారణ జలుబు చేసిన వారు కూడా గాంధీ బాట పడుతున్నారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 70 మంది లక్షణాల అనుమానిత రోగులు పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వృత్తి, ఉద్యోగ పనులపై వివిధ రాష్ట్రాలకు వెళ్లి హైదరాబాద్‌కు
చిన్న అనుమానం.. గాంధీకి ప్రయాణం
వైద్య పరీక్షల అనంతరం బయటకెళ్తున్న రోగులు
పరీక్షలు చేస్తున్న వైద్యులు
మందులతో ఇంటికి..
ఆదివారం ఒక్కరోజే 70 మందికి పరీక్షలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానంతో సాధారణ జలుబు చేసిన వారు కూడా గాంధీ బాట పడుతున్నారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 70 మంది లక్షణాల అనుమానిత రోగులు పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వృత్తి, ఉద్యోగ పనులపై వివిధ రాష్ట్రాలకు వెళ్లి హైదరాబాద్‌కు వచ్చిన దాదాపు నలభై మంది ఆదివారం గాంధీకి వచ్చారు. కేవలం వైద్య సలహాలు తీసుకునేందుకు కొందరైతే మిగతా కొందరు అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వారిలో దగ్గు, జ్వరం, జలుబు ఉన్న వారు మాత్రమే అధికంగా ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం తక్కువ సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు.
కొడుకు ఇటలీ నుంచి వచ్చాడు... తండ్రికి గాంధీలో పరీక్షలు
రామంతాపూర్‌కు చెందిన రామకృష్ణ ఎన్‌ఎఫ్‌సీలో ఉద్యోగి. తన కొడుకు గౌతం కులకర్ణి ఈ నెల 7న ఇటలీ నుంచి రామంతాపూర్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తండ్రి రామకృష్ణ ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ అనుమానిత వైద్య పరీక్షలు చేయించుకొని వెళ్లిపోయాడు. తన కొడుకుకు ఎయిర్‌పోర్టులో స్ర్కీనింగ్ టెస్టులు చేశారని, అతనికి ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించారు. అయినా.. అనుమానం పట్టలేక తాను గాంధీ ఆస్పత్రికి వచ్చానని ఆయన చెప్పారు.
కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు...
కరోనా వైద్య పరీక్షలు చేసుకునేందుకు కొత్తపేట్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు మొత్తం గాంధీ ఆస్పత్రికి చ్చారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. దాదాపు ఆరుగురు సభ్యులు పరీక్షలు చేసుకోగా ఎలాంటి లక్షణాలూ లేవని, 20 రోజుల పాటు ఇంట్లో ఉండి ఆరోగ్యసూత్రాలు పాటిస్తే సరిపోతుందని, అందుకు తాత్కాలిక మందులు రాసి ఇంటికి వెళ్లాలని సూచించారు.
నేరుగా గాంధీకి...
రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరిన ఓ యువతి నేరుగా గాంధీ ఆస్పత్రికి తండ్రితో పాటు వచ్చింది. యువతికి వైద్య పరీక్షలు చేశారు. జలుబు, దగ్గు ఉందని ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి వచ్చానని ఆ యువతి మీడియాతో చెప్పింది. ప్రస్తుతం వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసి ఇంటికి వెళ్లాలని సూచించారని, రెండు రోజుల తరువాత రిపోర్టు వస్తే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని వైద్యులు చెప్పారని ఆ యువతి తెలిపారు. ఆదివారం ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులు ఒక యువతి కేరళ నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చారు.
జ్వరం, దగ్గు ఉంటే గాంధీకే
కాస్త నలతగా ఉంటే చాలు అప్రమత్తమవుతున్నారు. వెంటనే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. స్థానిక జనం కూడా చుట్టు పక్కల ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడితే వారిని ఆస్పత్రికి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారి విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులకు కరోనా అనుమానితులు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం భోలక్‌పూర్ నివాసి 50 ఏళ్ల మహిళకు జ్వరం, జలుబు, విరేచనాలు ఉండడంతో ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన సిబ్బంది ఎక్కడికైనా వెళ్లి వచ్చిందా విషయాలపై ఆరా తీశారు. ఇటీవల ఆమె సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చినట్లు గుర్తించడంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మె నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణకు ల్యాబ్‌కు తరలించారు. శనివారం రాత్రి టోలిచౌకిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
Updated Date - 2020-03-16T17:00:27+05:30 IST