ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బందికి వైరస్‌ తాకిడి

ABN, First Publish Date - 2020-08-09T08:39:19+05:30

స్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోలుకుని మళ్లీ విధుల్లోకి..
  • ప్లాస్మా దాతల జాబితా రూపకల్పన ప్రయత్నాలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో వైరస్‌ సోకి కోలుకున్న వారి వివరాలను కొంతమంది జూనియర్‌ వైద్యులు సేకరిస్తున్నారు. వైరస్‌ తాకిడి నుంచి కోలుకున్న వారితో ప్లాస్మా దాతల జాబితా రూపొందించేందుకు ఈ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోని అధ్యా పకులు, కళాశాల పరిధిలోని పీజీలు, సీనియర్‌ రెసిడెంట్స్‌ (ఎస్‌ఆర్‌), రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఆర్‌ఎంఓ)లు, ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిలో కొంత మం ది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో కొందరు ఇప్పటికే కోలుకొని తిరిగి విధుల్లో చేర గా... కొందరు హోంఐసొలేషన్‌లో ఉన్నారు. అవసరమైన వారు చికిత్స కూడా తీసు కుంటున్నట్టు కళాశాల వర్గాలు తెలిపాయి. అత్యధికంగా సర్జరీ విభాగంలో 18 మం ది పీజీలు, పీడియ్రాటిక్‌ విభాగంలో 14, జనరల్‌ మెడిసిన్‌లో 12 మంది పీజీలకు, 55 మందికిపైగా ఇంటర్న్‌షిప్‌ చేసేవారికి వైరస్‌ సోకినట్లు జూనియర్‌ వైద్యులు సేకరించిన సమాచారంలో ఉందని తెలిసింది. ఇంటర్న్‌షిప్‌ చేసే కొంత మంది కూడా వైరస్‌ బారినపడ్డారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల పరిధిలోని ప్రభు త్వాసుపత్రుల్లో కరోనా బాధితులకు, అనుమానితులకు వీరు సేవలందిస్తున్నారు. లక్షణాలు లేని రోగులతో వైద్య సిబ్బందికి వైరస్‌ సోకుతోంది. పీపీఈ కిట్‌లు ధరి స్తున్నా... జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్‌ సోకుతుండడంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-08-09T08:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising