ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన

ABN, First Publish Date - 2020-06-06T10:50:07+05:30

కరోనా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో నిమ్స్‌ యాజమాన్యం విఫలమైందని, సిబ్బందికి గ్లౌజ్‌లు, శానిటైజర్లు అందజేయడంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపణ


వెంకటేశ్వరకాలనీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో నిమ్స్‌ యాజమాన్యం విఫలమైందని, సిబ్బందికి గ్లౌజ్‌లు, శానిటైజర్లు అందజేయడంలో అశ్రద్ధ, రవాణా సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ నిమ్స్‌ గౌరవాధ్యక్షుడు ఈశ్వర్‌రావు ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై తెలంగాణ ఉద్యోగ సంఘం, ఫెస్సీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిమ్స్‌ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం బైఠాయించారు.


ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, కార్మికులు కొవిడ్‌ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిమ్స్‌ యాజమాన్యం విఫలమైందన్నారు. నిమ్స్‌ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సత్యాగౌడ్‌ కూడా మాట్లాడారు. అనంతరం ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ను కలిసి సమస్యలను వివరించారు. ఉద్యోగులు కరోనా బారిన పడకుండా రక్షణ చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. ఆందోళనలో నర్సుల యూనియన్‌ నాయకురాలు విజయకుమారి, సుశీల కుమారి, స్వప్నరాణి, సుజాత, తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T10:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising