ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు అదృశ్యం..

ABN, First Publish Date - 2020-03-27T16:43:38+05:30

వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది. కూరగాయలకు కొనేందుకు వెళ్లిన ఆ మహిళ కనిపించకుండా పోయింది.. ఎంతకూ భార్య ఇంటికి రాకపోవడంతో ఆ భర్త.. అంతా వెతికి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాచిగూడలో నవవధువు అదృశ్యం 

బర్కత్‌పుర, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది. కూరగాయలకు కొనేందుకు వెళ్లిన ఆ మహిళ కనిపించకుండా పోయింది.. ఎంతకూ భార్య ఇంటికి రాకపోవడంతో ఆ భర్త.. అంతా వెతికి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని కామ్‌గార్‌ నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణకు ఐశ్వర్య(20)తో ఈనెల 20న వివాహం అయ్యింది. ఉగాది సందర్భంగా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఐశ్వర్య కిరాణాషాపునకు వెళ్లింది..


ఆమె వెళ్లి ఎన్ని గంటలయినా తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ కూడా దుకాణానికి వెళ్లాడు.. ఆ చుట్టుపక్కల అంతా గాలించాడు. అయినప్పటికీ ఆమె కనిపించలేదు.. భార్య తిరిగొస్తుందని బుధవారం అంతా వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం భర్త సత్యనారాయణ కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-27T16:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising