దేశంలోనే మొదటిసారిగా నెహ్రూ జూపార్కుకు ఐఎస్ఓ సర్టిఫికెట్
ABN, First Publish Date - 2020-12-17T11:54:55+05:30
అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అందరి ప్రశంసలు
హైదరాబాద్ : అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఐఎస్ఓ 9001ః 2015 సర్టిఫికెట్ రావడం హర్షణీయమని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఐఎ్‌సఓ 9001 జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని బుధవారం ఆయన అటవీ శాఖ, జూ అధికారులకు అందజేశారు. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన దేశంలోనే ఏకైక జూపార్కు మనదే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఫారెస్ట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతా్‌పరెడ్డి, జూ డైరెక్టర్ సదానంద్ కుక్రెట్టి, క్యూరేటర్ ఎన్.క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డాక్టర్ ఎం.ఏ.హకీమ్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-17T11:54:55+05:30 IST