ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత సామరస్యం

ABN, First Publish Date - 2020-07-13T10:38:49+05:30

బోనాల ఉత్సవాలలో అమ్మవారి ఘటాల ఊరేగింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముషీరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాలలో అమ్మవారి ఘటాల ఊరేగింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దేవాలయపుర వీధులలో అమ్మవారి ఘటాన్ని ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఘటాల తయారీని అత్యంత పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు. ముషీరాబాద్‌లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఘటాన్ని 35 ఏళ్లుగా తయారుచేస్తూ.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు బాబూలాల్‌. ముషీరాబాద్‌ భరత్‌నగర్‌కు చెందిన బాబులాల్‌ వృత్తిరీత్యా పూల వ్యాపారి. ఆయన ప్రతి రోజూ 25 పైసల పూలను అమ్మవారి పూజకు ఇవ్వడం 35 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. నాటి నుంచి పూలను ఇస్తూనే ఉన్నారు.


2005లో శ్రీమహంకాళి దేవాలయం నుంచి అమ్మవారి ఘటాన్ని తయారు చేయాల్సిందిగా ఆలయ నిర్వాహకులు బాబులాల్‌ను కోరారు. ఆయన అంగీకరించి ఆనాటి నుంచి నేటి వరకు ఘటాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో అలంకరిస్తున్నారు. ఈ ఆదివారం నుంచి ప్రారంభమైన బోనాల ఉత్సవాలకు భార్య సూల్తానా బేగం సహాయంతో అమ్మవారి ఘటాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఘటాన్ని ఆలయ పురవీధుల్లో ఈ నెల 19 వరకు ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. బాబులాల్‌ కుమారులు సైతం ఏటా బోనాల ఉత్సవాలకు దేవాలయాన్ని పూలతో అలంకరిస్తారు. 


భక్తిశ్రద్ధలతో ఘటాన్ని తయారు చేస్తాం ..బాబులాల్‌

గత 35 ఏళ్లుగా అమ్మవారి పూజ కోసం పూలను రోజూ అందిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా అమ్మవారి ఘటాన్ని తయారుచేస్తున్నాను. నేను ముస్లిం అయినప్పటికీ అమ్మవారి ఘటాన్ని తయారుచేసే అవకాశం ఇచ్చినందుకు దేవాలయ నిర్వాహకులకు, స్థానికులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఘటాన్ని చూసి వారందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంటుంది. 



Updated Date - 2020-07-13T10:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising