మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
ABN, First Publish Date - 2020-08-12T09:49:41+05:30
మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా తీవ్రతవల్ల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాతం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్‌నదీం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-12T09:49:41+05:30 IST