ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుట్‌పాత్‌వ్యాపారులకు న్యాయం చేస్తాం: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2020-08-04T09:49:06+05:30

ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వారికి న్యాయం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెజిమెంటల్‌బజార్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వారికి న్యాయం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బాటా వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో సోమవారం ఫుట్‌పాత్‌ వ్యాపారులతో మోండా మార్కెట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, ప్రభుత్వం రోడ్లు, ఫుట్‌పాత్‌లను నిర్మిస్తోందన్నారు.


తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. ఎంతమంది వ్యాపారులు ఉన్నారు, వారికి ఎంత స్థలం అవసరమవుతుంది, తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని ట్రాఫిక్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. మోండ మార్కెట్‌ కార్పొరేటర్‌ రూప, ఉత్తర మండల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, బేగంపేట్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ ముకుంద్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీలు రాములు నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌యాదవ్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, వెటర్నరీ డాక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T09:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising