అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN, First Publish Date - 2020-09-12T09:46:09+05:30
అటవీ సంపద సంరక్షణలో ఎంతోమంది అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడూ ..
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మదీన, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): అటవీ సంపద సంరక్షణలో ఎంతోమంది అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన వారి స్మారకార్థం నిర్మించిన స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన వన సంపదను భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, అటవీశాఖ ఉన్నతాఽధికారులు ఆర్. శోభ, రఘువీర్, ఆర్. హేమంత్ కుమార్, దోబ్రియల్, లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, సిదానంద్ కుక్రెట్టి, జూపార్కు క్యూరేటర్ ఎన్. క్షితిజ, ట్రైనీ ఐఎ్‌ఫఎస్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-12T09:46:09+05:30 IST