ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన వ్యక్తికి నెగెటివ్‌... కుటుంబసభ్యులకు పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-07-09T10:19:54+05:30

మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. డిఫెన్స్‌కాలనీకి చెందిన వ్యక్తి(50) ఇటీవల అనారోగ్యంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. డిఫెన్స్‌కాలనీకి చెందిన వ్యక్తి(50) ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయనతోపాటు కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. చనిపోయిన వ్యక్తికి నెగెటివ్‌ రాగా అతడి భార్య(45), ఇద్దరు కుమారు(20), (15)లకు పాజిటివ్‌ వచ్చింది. ఉప్పరిగూడ రాజానగర్‌కు చెందిన వ్యక్తి(37), సీతారాంనగర్‌లో ఒకరు(44), ఆర్‌కేనగర్‌లో ఒకరికి(49), న్యూ విద్యానగర్‌లో ఓ వ్యక్తి(49), ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌కు చెందిన మహిళ(38)కు పాజిటివ్‌ వచ్చింది. 


ఇద్దరి మృతి

భోలక్‌పూర్‌ పరిధిలో గంగపుత్రకాలనీకి చెందిన వృద్ధురాలు, ఖైరతాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన మహిళ కరోనాతో మృతి చెందారు.


భయాందోళనలో ప్రజలు 

కరోనా పరీక్ష చేయించుకున్న వారి రిపోర్టు రావడానికి మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. పాజిటివ్‌ వస్తుందా? నెగెటివ్‌ వస్తుందా? అని పరీక్షలు చేయించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ వస్తే కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. సరోజినీదేవి ఆస్పత్రిలో కరోనా పరీక్షాకేంద్రానికి ప్రతినిత్యం 300 మంది వస్తున్నారు.  200 నుంచి 250 మంది నమూనాలు మాత్రమే సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. రిపోర్టు మూడు, నాలుగు రోజుల తర్వాత వస్తోంది. కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 3న పలువురి నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు రిపోర్టు రాలేదు. దీంతో వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-07-09T10:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising