ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25వరకు లీడ్‌ ఇండియా కొవిడ్‌ 19 పోటీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-07-09T10:20:40+05:30

విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం విలువలతో కూడిన విద్యాస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముషీరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం విలువలతో కూడిన విద్యాస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు  ‘లీడ్‌ ఇండియా కొవిడ్‌ 19 చాంపియన్‌ షిప్‌’ ఆన్‌లైన్‌ లెవల్‌ వన్‌ పోటీ పరీక్షలను ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు లీడ్‌ ఇండియా ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారులు పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఎలాంటి రుసుం లేదని తెలిపారు. ప్రతిరోజూ 24 గంటల పాటు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ డాట్‌ ఆర్గనైజేషన్‌/కొవిడ్‌-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Updated Date - 2020-07-09T10:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising